Home

Devalekhini✍

మనసు లేని మనిషి గలడా మనలోన
సైగ లేని మౌనం
సాగగలదా మనుగడలోన

మాట లేని మూగవాడు సైగ చాలు
చేతలే చూడు చెవిటివాడికి అడ్డు లేదు
అవయవాలన్ని లేకున్నా
అవిటివాడికి ఆటంకం ఏముంది
తన కథలని తన ఎదుటే నిలుపేగా

మోడుబారిపోదా లోకం
మూగబోయిన మనసులతోన
ఏ లోటు లేకున్నా మనిషిగా నిలోనా
రాయలేని వారు ఎవరు
రాయని వారే వారు

అంధకారం కాదిది అందరం ఏకమైతే
రండి.. వినండి.. పలకండి..

Dedicating this blog in striving to fill the gap in our world where human’s emotions/feelings were lost in transition from one’s own thoughts to words, actions and their own accomplishments further due to lack of cohesion with people around them or rather due to one’s own lack of ability to impart it among them.

Art is an expression of one’s own thoughts…

Hoping these expressions of mine might deliver those existing thoughts to long reach.

కొండంత అండ తానే, గొడుగంత నీడా తానై నడిపించిన నాన్న
కష్టమొర్చి ఇష్టంగా లాలించే అమ్మ
నడుమ రెక్కలు తెచ్చుకు ఉగే ఊహాలుతో ఎగురుతూ
అవి తెంపుకు ఆగే ఆశలు వెనక వేదనని భరిస్తూ
సాగె గమనంలో సాయం కోసం ఎదురుచూస్తూ
బరిలోకి దిగిన నేను, నా బోటి బాటసారులైన మీరు
మన ప్రపంచాన్ని, మన జీవితాన్ని మనమే కొత్తగా వర్ణించుకుందాం..

-Devendra