ఆనందమే…

ఆనందం…ఆనందం..
కనిపించని ఆనందం నా కళ్లలోన ఈవాళ..


కిలకిలమని పలికే కోయిల సరాగం ఆనందం
జల జల పారే సెలయేరు చేసే సవ్వడి ఆనందం
పొద చాటుల్లో రెపరెపలాడే ఆ సూర్యుని కిరణాలే ఆనందం

ఆనందమిది ఆనందం..
రెక్కలు చాచుకు ఎగిరే పక్షుల ఆనందం
గూటికి చేరిన గువ్వల తల్లికి ఆనందం
పురివిప్పిన నెమలి చేసే నాట్యం అనందం
కరిమబ్బులు చూసి పలికే మన్నుకి ఆనందం

ఎన్నెన్నో అద్భుతాలును దాచే ఉంచిన ప్రకృతి పరమానందం..

ఆనందం…


తడబడు అడుగుల జాడల జ్ఞప్తిక ఆనందం
పసిపాపల బోసి నవ్వులు ఆనందం
చేరవేసిన చేతికి అందించిన చేయూత మహదానందం

ఆనందం…ఆనందం..
రెప్పల చాటున కనిపించే కన్నీళ్లే కొంత ఆనందం
ఒకరకి ఒకరు ఉన్నామన్న బాసట ఇంకా ఆనందం

ఆనందమిది ఆనందం
ఎవరికి ఎవరు ఏమి అవ్వని
అయినా ఒకటై సాగే లోలో సమ్మతి ఆనందం

కురిసే వెన్నెల ఆనందం
తడిసే నేలకు ఆనందం
విరిసే పువ్వుల సుమగంధాలు ఆనందం..

మెరిసే తారలు ఆనందం
పరిచిన చాపలు ఆనందం
ఎదురుగా తేలుతున్న మేఘాలలోని ఆకృతి ఆనందం..

ఏడేడు జన్మాలలో మళ్ళీ జీవిస్తామన్నా ఆశే ఆనందం

అందరిలోను ఉన్న ఆ అందమే
నాకూ అద్దం పడుతుందేమో మరి..

నాలో దాగున్న నన్నే సరికొత్తగా చూపెడుతుంటే నాకే ఆనందం..

ఆనందం..ఆనందం..

అందమే..ఆనందమా..అందరము ఏకమా..
లోలో పొంచి ఉన్న అందమిది.. పూయగా రాలేనిది..

నువ్వు నేను చెట్టు చేమల్లాగ ప్రకృతిలోని భాగాలేగా

అదృష్టం నీ తోడుగా లేదని నీ దృష్టిని కాస్త మార్చావా..
నికృష్టం నీకిక రాదని నీ కృషినే మరిచావా..

చేసేదేదో చేస్తూనే ఉంటే ఫలితం దక్కిన ఆనందం చిక్కును కదా ..

ఆనందం…ఆనందం..
కనిపించని ఆనందం నా కళ్లలోన ఈవేళ..

   –దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)