ఈవేళ.. నీవేళ.. (2)

అరె నింగికి చేరే జనమందరి ఆనందం 
నీ చుట్టూ చేరి ఈవేళ.. నీవేళ..
మరి ముందుకు సాగాలోయ్ ఈ వేడుక

మేముండగా.. నీ ముందుగా.. ఇలా..

తరతరాలకి తరగని నీ సావాసమే

నిదర్శనమై నిలవాలోయ్.. నీ  పై చిరునవ్వే చిందించీ..


కలకాలం గుర్తుండేలా గడపాలోయ్..

నేడే ను నివ్వెరపోయేలా..

మునుపెన్నడూ లేని తీరుగా.. 
మరుపేరాని వీలుగా.. 
జరగాలోయ్ ఈ సంబరం.. తాకాలోయి ఆ అంబరం..

అరె నింగికి చేరే  జనమందరి ఆనందం 
నీ చుట్టూ చేరి ఈవేళ.. నీవేళ..
మరి ముందుకు సాగాలోయ్ ఈ వేడుక

మేముండగా ..నీ ముందుగా.. ఇలా..

నీకోసం గడిపే రోజులెన్నో.. నీకై గడిచే రోజులు మరెన్నో..

జన్మదిన శుభాకాంక్షలు…

                                                   -దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)