మిత్రమా ..

తలతలమని తారలన్ని  తళుక్కుమనవా నిన్ను చూసి..
మసక లేని మనసుతోన నిండి ఉన్న నీ నవ్వు చూసీ … మిత్రమా

కళకళలాడుతున్న కాలమంతా కళ్ళలోన..
నీతోనే నిండి వున్నా..
మిళమిళమిలా మెరుస్తూ ఉన్న మరుపులేని స్మృతులతోనా… మిత్రమా

ఈవాళే  ని సంబరాలని అంబరాలను అంటనివ్వమా ..
నీతోనే చిందులేసి చెంత చేరమా..

ఇలానే .. నిలానే.. మాతోనే.. వుండాలని వేడుకుంటు…
ఈరోజే.. రోజులా.. గుర్తుండిపోవాలని కోరుకుంటూ…

తలతలమని తారలన్ని  తళుక్కుమనవా నిన్ను చూసి..
మసక లేని మనసుతోన నిండి ఉన్న నీ నవ్వు చూసీ … మిత్రమా

కళకళలాడుతున్న కాలమంతా కళ్ళలోన..
నీతోనే నిండి వున్నా..
మిళమిళమిలా మెరుస్తూ ఉన్న మరుపులేని స్మృతులతోనా… మిత్రమా

                                                                                                                              -దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)