మనలోని మంచితనం

ఏది మంచి…. ఎవరికి మంచి….
నీతో నడిచే నీ వారంటు ఉన్నంత వరకూ..
నీకై తపించే నీకో తోడున్నoత వరకూ..

మనిషికి మనిషికి మనసే వేసె ముసుగే మంచితనం..
కలిసుండే వాళ్లకి కలిసొచ్చేదేగా మన మంచితనం..

మంచన్నది లేనిది ఎవరికి..
నీకునాకన్న కంచేగా మిగిలేది చివరికీ…

మనిషన్నాక మనసున్నాక
మదిలో మెసిలే మంచితనం..
మనదీ, మనమన్నా పిలుపునకే పరిమితమైనా మంచితనం…

ఒకరికి ఇష్టం.. ఒకరికి కష్టం…
ఒకరికి లాభం.. ఒకరికి నష్టం…

ఏది మంచి…. ఎవరికి మంచి….
నీతో నడిచే నీ వారంటు ఉన్నంత వరకూ..
నీకై తపించే నీకో తోడున్నoత వరకూ..

                                                      – దేవేంద్ర    

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)