తీరని దాహం

తీపి ఎంత తెగువైనా…
బాధ ఎంత బరువైనా…
మోసేవాడికి ఎమున్నదిలే కష్టం..
అందనిదేదో ఉన్నది అన్న తియ్యదనం…

ఎదో ఉందని ఎంతో దూరానా..
ముందే ఊడ్చుకు సర్దుకుపోయేనా..
ఉన్నది లేదని లేనిది రాదని
తెలిసే లోపే కాలం పైబడెనా…
మనకీ లోకం చేయిజారేనా…

బ్రతుకంతా నిత్యాన్వేషణ సంఘర్షణ..
మనసంతా సత్యమున్మిత్య సంవాదన..
జగమును దర్శించేదేనాటికి…
జరిగే దానందించేదాపాటికి…

తీపి ఎంత తెగువైనా…
బాద ఎంత బరువైనా…
మోసేవాడికి ఎమున్నదిలే కష్టం
అందనిదేదో ఉన్నది అన్న తియ్యదనం…
    – దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)