మా చిత్ర దర్శకుడు కి ..

క్షణమన్న కునుకే రాక.. తలపులతో తపించే తీరిక లేక..
సమయంతోనే సమరం సాగించె నీకే సలామ్…

ఏ చోట నిలుచున్న.. ఎటువైపు చూస్తున్నా..
చేయనిదేదో చేయాలన్న నీలో చింతే నిను చిత్రించింది…

సాయం కోసం చేతులు జాచిన.. ఎంతటి సాన్నిత్యం ఉన్నా,
శ్రమకే ఒరిగే నీ ఔదార్యానికి సలామ్…

ఇన్ని వింతలనీ చిత్రంగా వీక్షించే జనులందరినీ..
చిగురించే సుమమైనా, సమకూర్చే చీమైనా..
కొండల్లోన.. కోనల్లోన..
నీ కంటికానిందేదైన కనువిందుగా చిత్రంచే నీకే సలామ్…

క్షణమన్న కునుకే రాక.. తలపులతో తపించే తీరిక లేక..
సమయంతోనే సమరం సాగించె నీకే సలామ్…

మాకు ఇన్ని చిత్రాలు చూబించిన ఈ చిత్ర దర్శకునికి

జన్మదిన శుభాకాంక్షలు….

-దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)