చెలిమి

అందమైన ఆత్రమైన.. అందులోని ఆనందమైన..
అంతులేని ఆహ్లాదమే ఈ చెలిమి…

భువి నుండి భువస్సు వరకు విశ్వమెంత పెద్దదైన..
నిన్ను కోరి నిన్ను చేరే సమస్తమే… స్నేహము

నిశ్చల ఎదలో నిట్టూర్పునకే నిచ్చెన వేసేదీ సావాసం..
నిత్యాన్వేషణలో నీతో తోడై నడిచే సహవాసం…

నిన్ను కాదని నీ పై నడిచెల్లక..
నువ్వు వద్దని నిన్ను విడిచి వెళ్లక..
కడలిలోని కెరటమల్లే కలిసి కొట్టుకుపోయేదే ఈ నెయ్యము…

ఈ మన్నునంటి విరిసే పరిమళాలకై..
ఆ మిన్ను నుండి కురిసే చిరుజల్లులే ఈ చెలిమి…

మనమెందరిలో ఉన్నా… మున్ముందర ఎమవుతున్నా…
మదిలో ఎపుడు మెదులుతు ఉండే మనమంతా…

అందమైన ఆత్రమైన.. అందులోని ఆనందమైన..
అంతులేని ఆహ్లాదమే ఈ చెలిమి…


                                         

                                                      – దేవేంద్ర
                      

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)