నెలరాజు

రాశులెన్ని ఉన్నా..నెలరాజు లేని రేయి చూడబోము..
ప్రపంచమెంత పెద్దదైనా.. నువ్వు లేని మేము కాన రాము..

ఈ సృష్ఠిలో  ఏముండనీ.. నీ దృష్ఠి పడనంతవరుకే…
నీ దృష్ఠిలో  ఏముండనీ.. ప్రతిసృష్ఠి  ఏ ప్రత్యక్షమవును…

నువ్వు తలపెట్టే ప్రతీ పనీ..చరిత్ర పుటల్లో కొత్త పంక్తుల కొరకే..
కాని నువ్వు చేపట్టే ప్రతీ పనీ..మా బోటి వారి ఆసరాకే…

నీతో సాటి ఎవ్వరు లేరు.. నీతో పోటి ఎవ్వరు రారు..
నీలో నువ్వే తపించి, నీకై నువ్వే శ్రమించి పోరా పై పైకి…

ఆ సూర్యుడిని కాసే మబ్బు వలే, ఆ చంద్రుడిని కప్పె నీడ వలే..
నీ ముందు మేముంటాం.. నీ దాటికి మేమాగం..

అంతే వేడిని ప్రకాశిస్తు.. అంతే వెలుగును చిందుస్తు..
మాతో ఇలాగే మెలగాలని కోరుకుంటు…

రాశులెన్ని ఉన్నా..నెలరాజు లేని రేయి చూడబోము..
ప్రపంచమెంత పెద్దదైనా.. నువ్వు లేని మేము కాన రాము..

                        
                                             – దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)