పెరిగే ప్రాయంతో…

కరిగే కాలంతో… పెరిగే ప్రాయంతో…
అళ్ళుకునే కథలెన్నో… పంచుకునే కలలెన్నో…

చిగురించే నీ చిరునవ్వుతో చిందేసేవారెందరో..
పలకరించే నీ మాటతో పులకరించేవారెందరో…

ఎవరైనా విరివిరిగా, కలివిడిగా కలిసిమెలిసే
నీ తోడుకై తపించే వారెందరో…

ఆశించక ఆదరించే నీ స్నేహానికి
దాసోహం అను వారెందరో…

కళ్లకు కట్టని నీ అమాయకత్వాన్ని ఎరిగినవారెందరో..
ముందుకు నడిపించే నీ నమ్మకానికి ఇంధనమిచ్చేవారెందరో…

నీలో నువ్వై లేక మాతో సందడి చేసే నికై
చిందులు తొక్కేె ఈ తరుణంలో సెలవిచ్చేదేమనగా…

కరిగే కాలంతో… పెరిగే ప్రాయంతో…
అళ్ళుకునే కథలెన్నో… పంచుకునే కలలెన్నో…

ఆ కథలో నెలకొన్న మేము..
నీ కలలే సాకారం కావాలని కోరుకుంటు…

జన్మదిన శుభాకాంక్షలు…

-దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)