బ్రతుకు బాట

బ్రతుకన్నది ఓ పయనం…
ఇది ఆది తెలిసినా, అర్ధం తెలియని..
అంతు చిక్కక ముందుకు సాగే గమనం…

నీ గమ్యమేదో తెలియకున్నా, దారే చూపే చిత్రమిది..
నీకై దారులు ఎన్నో ఉన్నా, నీ రాకకై వేచి చూడని వైనమిది…

నువ్వు కాలంతోనె కొట్టుకుపోతే, ఎదురెళ్లి ఈదేది ఎవరురా..
నువ్వు జన సంద్రంలోనే మునిగిపోతే, నిను ఒడ్డుకు చేర్చేదెవరురా…

నీకై నువ్వే అన్వేషించి, నువ్వే నిజమని సాహసించి..
తెలియని దారులే కొత్తగా పట్టి, తెరవని తలుపులే తెరవరా…

నువ్వేసే ప్రతి అడుగు, ఒకరికి జాడై నిలుస్తుంది..
నువ్వు తిరిగే ప్రతి మలుపు, ఒకరికి ముప్పుని తొలిగిస్తుంది…

నువ్వు నడిచే ఈ బాట, నిన్నటి వెలుగుకి నిదర్శణం..
నువ్వు జీవించే ఈ జీవనం, రేపటి తరానికి ఆదర్శం…

బ్రతకన్నది ఓ పయనం…
ఇది ఆది తెలిసినా, అర్ధం తెలియని..
అంతు చిక్కక ముందుకు సాగే గమనం…

                                                    –దేవేంద్ర

షేర్ చెయ్యండి:

One Reply to “బ్రతుకు బాట”

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)