నాలో కవి

ఆ నింగీ నేల ఒక్కటవ్వని.. ఆ భాస్కరుడే భువిని వీడని..
యి నిశి యె దిశ నిర్ధెశించనీ.. నాలో ఈ శిఖ ఆరదు….

కడలే కదిలి పుడమిని తాకని.. కదిలే కాలం రూపే మారని..
మహిలోని జీవనమె కరువవ్వని.. నాలో జ్వలనం చల్లారదు….

నాలో నేనె అన్నీ నేనై, విధి నుండి పరి పరి వేరై..
మరుపె రాని స్మ్రుథులె తోడై, ఎదలో ఏదో అలజడి రేకెత్తిస్తుంటె….

మరి కవినే కాన ఈనాడు, ప్రతి పదము నా చె పలికిస్తుంటె..
మున్ముందుకు సాగే ఈ పయనం, నాలో ఊపిరి ఉన్నంత వరకు….

ఆ నింగీ నేల ఒక్కటవ్వని.. ఆ భాస్కరుడే భువిని వీడని..
యి నిశి యె దిశ నిర్ధెశించనీ.. నాలో ఈ శిఖ ఆరదు….

కడలే కదిలి పుడమిని తాకని.. కదిలే కాలం రూపే మారని..
మహిలోని జీవనమె కరువవ్వని.. నాలో జ్వలనం చల్లారదు….

                                   – దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)