ఈ క్షణం …

మదిలో మెదిలే కలలే అలలై ఎగిసెనే ఈ క్షణం..
కలం పట్టుకుని కథనం లేకున్న కదిలిస్తుంటే నా కరం…

మాటే లేదని జీవితమేదని ప్రశ్నిస్తుంటే ఈ జనం..
జవాబే ఇది అని కాంతిని చూపే ఈ ఏకాంతం…

మరి మనసే మురిసే తన మాటే వింటున్నందుకు..
కాలం తోటే సాగె యి పయనం కలమే కదిలే అంతవరకు…

‘మనం’అంటు మనకంటు ఒకరంటు ఉంటేగా ఇవి చేరడానికి..
మీరంటు నాకంటు ఓ కొత్త జ్ఞాపకమే చేర్చడానికి…

మదిలో మెదిలే కలలే అలలై ఎగిసెనే ఈ క్షణం..
కలం పట్టుకుని కథనం లేకున్న కదిలిస్తుంటే నా కరం…

                                                  – దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)