ఈవేళ.. నీ వేళ..

నువ్వేదిగే కొద్ది పెరుగుతున్న ఈ ప్రేమే పునాదిగా చెబుతున్నా..

ఆనందం పొంగుకొచ్చేనే నిను చూస్తుంటే ఈరోజు..
ఆరాటం ఆగనంటుంటే నిను చేరాలని ఈరోజు..

మన ఇద్దరి సావాసమే గుర్తుగా..
నువ్వు నడిచిన ఈ ప్రపంచమే సాక్షిగా…,
నీ నవ్వులే కురిపిస్తున్న హరివిల్లులా..
తేలియడాలి నీ ప్రతీక్షణం…

కలలోనైనా కనుమరుగవ్వని నీతో నడిచిన ఈ మధురక్షణాలు…
నిదురేపోనివ్వని నిను చేరేదాక ఈ అక్షర సుమజాలాలు…

నువ్వు ధివి నుండి దిగివచ్చిన ఈవేళ..
నాలో చిరునవ్వే చిగురించిన ఈవేళ..

నీకై వేచివున్న ఈ సమస్తమే చాటి చెప్పేదేమనగా…

జన్మదిన శుభాకాంక్షలు

– దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)