లక్ష్యం

ఆశ ఉంటే అలజడి వస్తుంది
అవసరముంటే ఆసరా వస్తుంది

మనకు కావాల్సింది ఏది, కావాలనిపించేది ఏది..

తేడా తెలిసినప్పుడు కదా
తప్పులు తెలిసేది, ఒప్పులు చేసేది..

అనవసరమైన దాని గురించి ఆశపడి ఆయాసపడడం
అవసరమైన దాని గురించి ఆలోచించి ముందుకెళ్లడం


చేరాల్సిన చోటికి చేరాలంటే పట్టాల్సిన బాట పట్టాలి కాని
తప్పటడుగులు ఎన్ని వేస్తే మాత్రం కంచికి చేరతాం..


అనుకోవడానికి కావల్సింది ఒక్క క్షణం.. కానీ
అనుసరించడానికి కావాల్సింది ఒక లక్ష్యం..

                                            – దేవేంద్ర

షేర్ చెయ్యండి:

పోస్టు గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలుపగలరు :-)